మూడో రోజుకు చేరిన బండి సంజయ్ పాదయాత్ర... ఈనాటి రోడ్ మ్యాప్ ఇదే!

  • మొన్న చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద పాదయాత్ర ప్రారంభం
  • నిన్న గోల్కొండ మీదుగా కొనసాగిన యాత్ర
  • ఈరోజు హిమాయత్ నగర్ వరకు కొనసాగనున్న పాదయాత్ర
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. పాదయాత్రను చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రారంభించిన సంజయ్... రెండో రోజున గోల్కొండ కోట దగ్గర బహిరంగసభను నిర్వహించారు. 2023 ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగురవేస్తామని ఈ సందర్భంగా ఆయన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈనాటి పాదయాత్ర తిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్ హౌస్ మీదుగా ఆరే మైసమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. అక్కడ సభను నిర్వహించిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత అజీజ్ నగర్ మీదుగా హిమాయత్ నగర్ వరకు సాగుతుంది. రాత్రి బండి సంజయ్ హిమాయత్ నగర్ లో బస చేస్తారు. రాత్రి 9.30 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఈరోజు మొత్తం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.

Bandi Sanjay
BJP
Pada Yatra
Road Map

More Telugu News